🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 6:31 am Posted by : TELANGANA KERATAM

యువతే కాంగ్రెస్ పార్టీకి బలం.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం!

News Image
 యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిని కలిసిన పోచారం, ఎదులబాద్ డివిజన్ నూతన అధ్యక్షులు
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 17: రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజంలో నూతన మార్పులకు పునాది పడుతుందని, యువతను రాజకీయ చైతన్యం వైపు నడిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని యువజన కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిని మేడ్చల్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర రాహుల్ ఆధ్వర్యంలో పోచారం డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాగుల వినోద్ కుమార్, ఎదులబాద్ డివిజన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చిలుకూరి నిఖిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల డివిజన్ అధ్యక్షులుగా నియమితులైన నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ పదవులు అలంకారం కోసం కాదని, ప్రజలకు సేవ చేయడానికి, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి లభించిన బాధ్యతలుగా భావిస్తున్నామని తెలిపారు. యువతలో రాజకీయ చైతన్యం పెంపొందిస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికీ చేరవేస్తామని అన్నారు. కేవలం పదవులకే పరిమితం కాకుండా యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి, ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
🏠 Home