రోడామేస్త్రీ నగర్ డివిజన్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు గిరి వర్దన్ రెడ్డి పర్యటన. నూతనంగా ఎన్నుకోబడిన నాయకులకు పత్రాలు అందజేస్తున్న గిరి వర్ధన్ రెడ్డి.
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
రోడామేస్త్రీ నగర్ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోని రోడామేస్త్రీ నగర్ డివిజన్ లో బీజేపీ
మేడ్చల్-మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరి వర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇటీవల ప్రమాదానికి గురైన పార్టీ కార్యకర్తను పరామర్శించి, ధైర్యం చెప్పి, పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ముఖ్య అతిథులుగా గౌరవ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షులు గిరి వర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరి వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. బీజేపీ కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని, పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమానికి అవసరమైన ఆర్థిక సహకారంతో పాటు అన్ని విధాలుగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డివిజన్ అధ్యక్షులు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ కార్యవర్గ సమావేశంలో పాల్గొని, నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులకు జిల్లా అధ్యక్షులు గిరి వర్ధన్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. నియామక పత్రాలు తీసుకున్నారు ప్రధాన కార్యదర్శులు ఎల్వీ రెడ్డి, పులి రాజు, ఉపాధ్యక్షులు నాగరాజు చారి, శ్రీనివాస్ నేత, సెక్రటరీ రామకృష్ణ, రాజేష్ బీజేపీ సీనియర్ నాయకులు మురళి గౌడ్, శంకర్, సెక్రటరీ మాణిక్ రెడ్డి, ఉపాధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, సెక్రటరీ మల్లెం కుమార్, కోశాధికారి లక్ష్మణ్ గౌడ్ ,డి. ఈ కార్యక్రమంలో నారాయణపేట ఇంచార్జ్ భాను చందర్ వర్మ, జిల్లా లేబర్ సెల్ కో కన్వీనర్ రాము, కిసాన్ మోర్చా కార్యదర్శి రామ్ రెడ్డి,జేపీ రాష్ట్ర మున్సిపల్ సెల్ కో-కన్వీనర్ రావుల శేషగిరి రావు రాష్ట్ర నాయకులు దయాకర్ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అరికెల సుధ గారు, జిల్లా మోర్చా అధ్యక్షులు శేఖర్ యాదవ్ గారు, శ్రీనాథ్ గారు, జిల్లా నాయకులు శేఖర్ ముదిరాజ్, రచ్చ చక్రధర్, శివాజీ, రాజ్ భాను చందర్, సాయినాథ్ నేత, కంది శ్రీరాములు, భీమ్ రావు, భీమ్ రాజు, విజయ్ శంకర్ డివిజన్ అధ్యక్షులు కట్ట కుమార్, సాయి ప్రతాప్, శారద, సరోజినీ, శివాని, వేణుగోపాల్, ముఖ్య నాయకులు మురళి గౌడ్, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు మరియు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.