🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:15 am Posted by : TELANGANA KERATAM

సంగారెడ్డిలో ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ప్రారంభించిన జగ్గారెడ్డి

News Image
*సంగారెడ్డిలో ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ప్రారంభించిన జగ్గారెడ్డి*
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 17, నవంబర్
*రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు వివిధ మోడళ్లలో ఎలక్ట్రిక్ బైక్‌లు
*ఒక్కసారి చార్జింగ్‌తో 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చని వివరించిన కంపెనీ ప్రతినిధులు
సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డులో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ప్రారంభించారు.కంది మండలం చేర్యాల గ్రామానికి చెందిన వెంకట్ ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ను జగ్గారెడ్డి ప్రారంభించి, అందుబాటులో ఉన్న వివిధ రకాల ఎలక్ట్రిక్ బైక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా బైక్‌ల పనితీరు, బ్యాటరీ సామర్థ్యం, చార్జింగ్, ప్రయాణ దూరం తదితర అంశాలను కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
ADMS కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్‌లు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కూన సంతోష్, కంది మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొగులయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, షోరూమ్ నిర్వాహకులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home