🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:20 am Posted by : TELANGANA KERATAM

ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమం

News Image
 కెరటం తాండూర్,ప్రతినిధి: అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.బషీరాబాద్ మండల కేంద్రంలో మండలానికి చెందిన దాదాపు 1,031 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ దీపక్ తివారితో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
పెన్షన్ పథకంలో అవినీతికి తావులేదు.. ఎవరైనా (రాజకీయ నాయకులైన, అధికారులైన) పెన్షన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే సహించేది లేదు.అర్హతే ప్రామాణికంగా, ఎలాంటి అవినీతి, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా పారదర్శకంగా పెన్షన్లు మంజూరు చేశాం.పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పేద ప్రజల నిరీక్షణకు ప్రజా ప్రభుత్వం తెరదించింది. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ వద్దకే వచ్చి పెన్షన్ మంజూరు పత్రాలను అందించడం ఎంతో సంతోషంగా ఉంది.గత పదేళ్ల పాలనలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డుల కోసం ఎదురుచూసిన ప్రజలకు ఇప్పుడు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం. రాష్ట్రంలోని పేద కుటుంబాలు ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నాం.

బషీరాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

బషీరాబాద్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేయించాం.మండలంలోని రహదారులన్నింటినీ అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నాం.గతంలో జూనియర్ కళాశాలకు జీవోలు ఇచ్చి వదిలేశారు. కానీ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి తరగతులను ప్రారంభించాం. నేడు విద్యార్థులు కళాశాలలో చదువుతున్నారు.ఈ నెల 19న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నాం. పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. గ్రామాల్లో పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మిస్తూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పిస్తున్నాం.

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. దశలవారీగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం.పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. నూతన ఇళ్లలో దీపావళి పండుగ చేసుకున్నాం.
Additional News Photo
🏠 Home