యాంటి బయాటిక్స్ అధిక వాడకం ప్రమాదకరం
యాంటి బయాటిక్స్ అధిక వాడకం ప్రమాదకరం
- ఫార్మసీ కౌన్సిల్ ఇండియా హెచ్చరిక
- త్వరలో హైద్రాబాద్ లో మెగా ఫార్మసీ జాబ్ మేళా
వరంగల్ ప్రతినిధి తెలంగాణ కెరటం :
యాంటీ బయాటిక్స్ ఎక్కువ వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు పెరిగి ఇబ్బందులు తప్పవని వక్తలు అభిప్రాయ పడ్డారు.
మంగళవారం హనుమకొండ కాళోజి కలక్షేత్రంలో సదస్సు జరిగింది. ఫార్మసీ డిగ్రీ లేని మెడికల్ షాపులు , కొంత మంది రూరల్ మెడికల్ ప్రాక్టీసనర్లు
వీటి వాడకాన్ని పెంచారని అన్నారు. ఉత్తమ శిక్షణ ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు అన్నారు.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో త్వరలో ఫార్మసీ మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్టు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ మొంతు కుమార్ ఎం పటేల్
ప్రకటించారు. ఇప్పటికే గుజరాత్లో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా వేలాదిమంది ఉపాధి అవకాశాలు పొందారని వెల్లడించారు. భవిష్యత్తులో ఫార్మారంగానికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. ప్రపంచ ఫార్మసిస్ట్ డే- నేషనల్ ఫార్మసీ వీక్ 2026 ను పురస్కరించుకొని వరంగల్లో గల కాళోజి కళాక్షేత్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 40 ఫార్మసీ కళాశాల ద్వారా 4000 మందికి పైగా విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొని ఫార్మసి ఉన్నతికి కృషి చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణం లో భారీ ర్యాలీ నిర్వహించారు. విశ్వంభరా ఎడ్యుకేషనల్ సొసైటీ సహకారంతో నిర్వహించిన ఈ ర్యాలీ వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు సుమారు రెండున్నర కిలోమీటర్లు సాగింది. కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మసీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఫార్మాసిటీని నెలకొల్పారని చెప్పారు. రాబోయే రోజుల్లో అనేక నూతన సంస్థలు ఈ రంగంలో ప్రవేశించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని, రీసెర్చ్ డెవలప్మెంట్ బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన మాజీ ఎంపీ కూడా చైర్మన్ మాట్లాడుతూ వైద్యరంగంతో దీటుగా ఫార్మసీరంగం అభివృద్ధి చెందడం ద్వారా అనేక నూతన ఔషధాలు తయారీకి అవకాశం కలుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యవర్గ సభ్యులు డాక్టర్ సలీముల్లా ఖాన్, స్టేట్ కో కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, స్టేట్ కన్వీనర్ డాక్టర్ ఎం వెంకటరమణ, విశ్వంభరా ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు సిహెచ్ దేవేందర్ రెడ్డి, సీఈవో సిహెచ్ విశ్వంభర రెడ్డి, తెలంగాణ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీధర్, నరసింహారెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి.