🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 7:55 am Posted by : TELANGANA KERATAM

ఆదివాసీ తుడుం దెబ్బ మహిపతి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.

News Image
సంత్ సేవాలాల్ మహారాజ్ చరిత్రపై మాట్లాడే ముందు గిరిజన పోరాట చరిత్ర తెలుసుకోవాలి.

ఆదివాసీ తుడుం దెబ్బ మహిపతి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.

ఆంగోత్ గోపాల్ నాయక్ మాజీ గిరిజన సేవా సంఘం అధ్యక్షులు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 17):

సంతు సేవాలాల్ మహారాజ్ చరిత్ర పై మాట్లాడే ముందు గిరిజన పోరాట చరిత్ర తెలుసుకోవాలని ఆదివాసి తుడుం దెబ్బతి మహిపతి అరుణ్ కుమార్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని గిరిజన సేవా సంఘం మాజీ అధ్యక్షులు ఆంగోత్ గోపాల్ నాయక్ అన్నారు. ఈ నెల 9వ తేదీన ఆదివాసీ తుడుం దెబ్బకు చెందిన మహిపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ సంత్ సేవాలాల్ మహారాజ్ ఈ ప్రాంతానికి చెందినవారా? తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టారా? తెలంగాణ కోసం ఏం చేశారు? అంటూ ప్రశ్నించడం సమంజసం కాదని గిరిజన సంఘం మాజీ అధ్యక్షులు ఆంగోత్ గోపాల్ నాయక్ అన్నారు.శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన భారతదేశంలోని లంబాడీ సమాజ ప్రజలకు ఆధ్యాత్మిక గురువని పేర్కొన్నారు. సమాజాన్ని మేల్కొలిపి, సన్మార్గంలో జీవించాలని, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని బోధించిన గొప్ప సామాజిక, ఆధ్యాత్మిక మార్గదర్శి అని కొనియాడారు. అలాంటి మహనీయుడి చరిత్రను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా లేదా అనే కోణంలో చూడటం సరైన పద్ధతి కాదని అన్నారు.అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం సంస్థానంలోని భూస్వాములు, పెత్తందారులు, దొరల దౌర్జన్యాలను ఎదిరించి పోరాడిన లంబాడీ బిడ్డలు టాను నాయక్, పాణి నాయక్ వంటి వీరుల చరిత్రను కూడా గుర్తించాలని సూచించారు. కొమురం భీమ్ వంటి ఆదివాసీ పోరాట యోధులతో పాటు గిరిజన, లంబాడీ సమాజ హక్కుల కోసం పోరాడిన అనేక మంది వీరుల త్యాగాలను విస్మరించకూడదన్నారు.ఆదివాసీ సమాజానికి ఉన్న చరిత్ర, త్యాగాలు ఎంత గొప్పవో, లంబాడీ సమాజానికి ఉన్న చరిత్ర, పోరాటాలు కూడా అంతే గౌరవించదగినవని పేర్కొన్నారు. ఒకరి చరిత్రను మరొకరు కించపరచడం వల్ల సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు.మహిపతి అరుణ్ కుమార్ గారూ!మీరు ప్రభుత్వంపై పోరాటం చేయాలనుకుంటే చేయండి. ఆదివాసీ, లంబాడీ ప్రజలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు, రిజర్వేషన్లు, సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీ పోరాట పటిమను ప్రజల హక్కుల సాధన కోసం వినియోగించండి.కానీ ఒక గిరిజన సమాజాన్ని మరొక గిరిజన సమాజానికి వ్యతిరేకంగా నిలబెట్టేలా మాట్లాడటం మాత్రం సమంజసం కాదు. చరిత్రను పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలని, అన్ని గిరిజన తెగల మధ్య ఐక్యతను కాపాడాలని కోరారు.గుర్తుంచుకోండి.. చరిత్ర ఎవరి సొత్తు కాదు. త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కాలి. గిరిజన సమాజాల మధ్య విభేదాలు కాదు.. ఐక్యతే మన బలం కావాలని అన్నారు.
🏠 Home