పెద్దేముల్ గురుకులలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
పెద్దేముల్ గురుకులలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం
- విద్యార్థులు టీచర్లు అయిన వేళ
- ఉల్లాసంగా ఉత్సాహంగా కార్యక్రమం
- బహుమతులు ప్రకటించిన ఉపాధ్యాయులు
- మెంటైనెన్స్ లో అదరగొట్టిన విద్యార్థులు
తెలంగాణ కెరటం,తాండూర్ ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని పెద్దెముల్ గురుకుల పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రిన్సిపల్ ఉపేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు అందరూ ఉపాధ్యాయులు అయి ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. విద్యార్థులలో ప్రిన్సిపల్ గా రాంచరణ్,వైస్ ప్రిన్సిపాల్, మహేష్, డిసీఓ గా వరుణ్,జి రాంచరణ్,సెక్రటరీ దివాకర్,కే. మోహన్, అనేకమంది విద్యార్థులు ఉపాధ్యాయులు అయ్యారు. బెస్ట్ టీచర్‌గా విద్యార్థులకు బహుమతులు కూడా ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ ఉపేందర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ రోజు స్వయంగా తమంతకు తమ పరిపాలించుకునే రోజు. ఉపాధ్యాయులు కష్టాలు సాధకబాధకాలు ఏ విధంగా ఉంటాయో విద్యార్థులకు ఈ స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకుంటాము. విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత హోదాలో ఉండాలని కోరుకుంటున్నాము. విద్యార్థులందరూ చక్కగా బోధించినందుకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇలాగే రాణించి ఉన్నత స్థానాన్ని అధిరోహించిన లేని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థులకు ఎన్నడు లేని ఉత్సవంతో మేమే టీచర్లు అయ్యాము. ఇది మాకు జీవితాంతం గుర్తుండిపోతుందని విద్యార్థులు తెలిపారు. ఈ ప్రోగ్రాం నిర్వహించిన ప్రతి ఉపాధ్యాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని విద్యార్థులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఉపేందర్, జెవిపి సర్పరాజ్, శివకుమార్,పూర్ణిమ,లైబ్రరీయన్ కృష్ణవేణి, అపర్ణ,సునీత, రజిత, మహేష్, వాసంతి, జ్యోతి, ప్రకాష్,మొగులయ్య, బబ్లు, ప్రవీణ్,నాగరాజ్, ముంతాజ్ బేగం, నరేష్, మహిజాబిన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.