🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 8:14 am Posted by : TELANGANA KERATAM

12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు

News Image
12వ వార్డు లబ్ధిదారులకు చేయూత ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 17, నవంబర్

సదాశివపేట పట్టణంలోని స్థానిక బసవ సేవా సదన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నూతన చేయూత ఆసరా పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన 12వ వార్డుకు చెందిన నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను స్వయంగా అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా పులిమామిడి మమత సదాశివపేటపట్టణ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంతరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం పులిమామిడి మమత రాజు మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. నూతనంగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం పులిమామిడి మమత రాజు మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. నూతనంగా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
అలాగే 12వ వార్డులో పింఛన్ పొందేందుకు అర్హత ఉండి, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తన దృష్టికి తీసుకువస్తే వారికి కూడా పింఛన్ అందేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు.
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజలకు ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక వసతులు అందించడంతో పాటు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె వివరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ టి శివాజి, ఛైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక మరియు పింఛన్ లబ్ధిదారులు నాయికోటి కావేరి, సంగీత, రుమాండ్ల జయశ్రీ, పండాల సుకన్య, సులోచన, ముంతాజ్, రహీమున్నిసా, హలీం సుల్తానా, కళావతి, సాయి కుమార్, లత, కైసర్ బేగం, వర్కల లక్ష్మి, మారేపల్లి లక్ష్మి, సంగమని, ఫహేదా బేగం, ఫౌజియా బేగం తదితరులు పాల్గొన్నారు.
🏠 Home