🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 8:29 am Posted by : TELANGANA KERATAM

మద్దుట్ల గ్రామానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి!

News Image
మద్దుట్ల గ్రామానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి!

డిపో మేనేజర్‌కు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం శూన్యం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రయోజనాలు మద్దుట్ల ప్రజలకు అందించాలి

జగిత్యాల జిల్లా, నవంబర్ 17  (మల్యాల): ప్రతినిధి - బొమ్మెన రఘు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న నేపథ్యంలో, మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు రాకపోకల కోసం ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని, ఆటో చార్జీలు చెల్లిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, వృద్ధులు ప్రయాణాల సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు నడిపిస్తే మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రయోజనం అందడంతో పాటు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు కూడా రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.ఇదే విషయమై ఆర్టీసీ డిపో మేనేజర్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజా పాలనలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్ఫూర్తితో, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెంటనే స్పందించి మద్దుట్ల గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మహిళలు, గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇకనైనా అధికారులు స్పందించాలి!
మద్దుట్ల గ్రామ ప్రజల రవాణా సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆర్టీసీ డిపో ఆవరణలో భారీ ధర్నా చేపడతామని గ్రామ నాయకులు, ప్రజలు మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నారు. మహిళలకు ఇచ్చిన ఉచిత ప్రయాణ హామీ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో అందని పరిస్థితి నెలకొందని, సంబంధిత, అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజాప్రతినిధులు మహిళలు మహిళా సంఘాలు మండిపడుతున్నాయి
🏠 Home