జగ్గారెడ్డితో ఫోటో కోసం సైకిళ్లపై వచ్చిన చిన్నారులు*
*జగ్గారెడ్డితో ఫోటో కోసం సైకిళ్లపై వచ్చిన చిన్నారులు*
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 17, నవంబర్
*వీరభద్రనగర్ కాలనీ నుంచి ఐబీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న పది మంది పిల్లలు*
*చిన్నారులతో సరదాగా ముచ్చటించి, ఫోటోలు దిగిన జగ్గారెడ్డి*
తమ అభిమాన నాయకుడు జగ్గారెడ్డితో ఒక్క ఫోటో దిగాలన్న చిన్నారుల కోరిక నెరవేరింది. సంగారెడ్డి పట్టణంలోని వీరభద్రనగర్ కాలనీకి చెందిన పది మంది పిల్లలు సోమవారం సాయంత్రం సైకిళ్లపై ఐబీ గెస్ట్‌హౌస్‌కు వచ్చి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని కలిశారు.
సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో జగ్గారెడ్డి ఐబీ గెస్ట్‌హౌస్‌లో ఉన్నారనే విషయం తెలుసుకున్న చిన్నారులు ఆయనతో ఫోటో దిగాలన్న ఉత్సాహంతో తమ సైకిళ్లపై అక్కడికి చేరుకున్నారు.
తనను కలిసేందుకు ప్రత్యేకంగా వచ్చిన చిన్నారులను చూసిన జగ్గారెడ్డి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. ఏం చదువుతున్నారు? ఏ స్కూల్‌కు వెళ్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? అంటూ సరదాగా ప్రశ్నిస్తూ వారితో కొద్దిసేపు గడిపారు.
అనంతరం చిన్నారులందరితో కలిసి ఫోటోలు దిగారు. తమ అభిమాన నాయకుడితో ఫోటోలు దిగాలన్న కోరిక నెరవేరడంతో పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డికి థాంక్స్ చెప్పి తిరిగి తమ సైకిళ్లపై ఇళ్లకు బయలుదేరారు.
రాజకీయ కార్యక్రమాలు, ప్రజా సమస్యలతో నిత్యం బిజీగా ఉండే జగ్గారెడ్డి తనను కలిసేందుకు వచ్చిన చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించడం ఈ సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.