🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 18 November 2026, 1:52 pm Posted by : D RAMAKRISHNA

ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి పద్మశ్రీ *వనజీవి* పేరు పెట్టాలి

News Image

ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి పద్మశ్రీ *వనజీవి* పేరు పెట్టాలి

  • బ్రిడ్జి సమీపంలో రామయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి 
  •  బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్తా

ఖమ్మం, నవంబర్ 18 (తెలంగాణ కెరటం): ఖమ్మం జిల్లా గర్వించదగిన వ్యక్తి, పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి దరిపల్లి రామయ్య గారి సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్తా కోరారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ దివాకర TS గారికి వినతిపత్రం సమర్పిస్తూ, ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జికి “పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్య కేబుల్ బ్రిడ్జి” అని నామకరణం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బ్రిడ్జి సమీపంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
దరిపల్లి రామయ్య తన జీవితమంతా పర్యావరణ పరిరక్షణకే అంకితం చేసి, మొక్కలు నాటుతూ, వాటిని సంరక్షిస్తూ సమాజంలో పచ్చదనంపై చైతన్యం కల్పించారని పేర్కొన్నారు. ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని గుర్తుచేశారు.
మన ఖమ్మం జిల్లా నుంచి ఎదిగి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇలాంటి మహనీయుడి పేరును నగరంలోని ప్రముఖ కేబుల్ బ్రిడ్జికి పెట్టడం ద్వారా జిల్లా గౌరవం మరింత పెరుగుతుందని అన్నారు. అంతేకాకుండా ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ పట్ల భావితరాలకు గొప్ప స్ఫూర్తి కలుగుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి, రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి తగిన చర్యలు తీసుకోవాలని వీరవెల్లి రాజేష్ గుప్తా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ అధ్యక్షులు గడిల నరేష్ పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home