🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 7:27 am Posted by : TELANGANA KERATAM

అగ్నిప్రమాద కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ

News Image
అగ్నిప్రమాద కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ 

మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో రూ.10 వేల ఆర్థిక సహాయం

 మండల పార్టీ అధ్యక్షులు చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు .

ములుగు జిల్లా బ్యూరో, (తెలంగాణ కెరటం) నవంబర్ 18:

మంత్రి సీతక్క ఆదేశానుసారం జిల్లా పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచన మేరకు 
మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామంలో బుధవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఇందారపు చెంచులక్ష్మి గృహం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా మంటల్లో కాలిపోయిన ఈ ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులతో కలిసి వెంటనే బాధిత కుటుంబం నివాసానికి చేరుకుని అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఇంటిని పరిశీలించారు.అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి,వారికి ధైర్యం చెప్పారు.

అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్కకు ఫోన్ ద్వారా ప్రమాద వివరాలను తెలియజేసి బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడించి తమ పరిస్థితిని తెలుసుకొన్న, మంత్రివర్యులు సీతక్క బాధిత కుటుంబానికి తక్షణ అవసరాలు,ప్రాథమిక ఖర్చుల నిమిత్తం రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఆపద సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా చెట్టుపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అయ్యోరి యానయ్య, శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం డైరెక్టర్ పూజారి సురేందర్,జిల్లా లీగల్ సెల్ చైర్మన్ బండ జగన్మోహన్ రెడ్డి, శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్ యర్రంగారి సురేష్, మండల పార్టీ ఉపాధ్యక్షులు కొంకతి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి చందర్లపాటీ శ్రీనివాస్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ తుడి భగవాన్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు ఇందారపు లక్ష్మణ్, సీనియర్ నాయకులు తుంబూరి రామ్ రెడ్డి, పొట్రు సమ్మయ్య మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home