నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్సీ ఎల్. రమణ
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలానికి చెందిన తాజా మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు శ్రీమతి బాదినేని రాజమణి – రాజేందర్ దంపతుల కుమారుడు బాదినేని కార్తీక్, ప్రగతి దంపతుల వివాహం ఈ నెల 15వ తేదీన ఘనంగా జరిగింది.అయితే వివాహ వేడుకకు అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయిన మాజీ ఎమ్మెల్సీ ఎల్. రమణ గారు, ఈరోజు బాదినేని రాజేందర్ గారి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులైన కార్తీక్, ప్రగతి దంపతులను ఆప్యాయంగా ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా బాదినేని కుటుంబ సభ్యులు ఎల్. రమణ గారికి ఆత్మీయ స్వాగతం పలికారు.