🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 7:37 am Posted by : TELANGANA KERATAM

మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తికి రూ.3,000 జరిమానా.. ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్

News Image
*మద్యం మత్తులో వాహనం నడిపిన వ్యక్తికి రూ.3,000 జరిమానా.. ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్*.......

*మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు: ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. హన్నన్*........
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.....
మంచిర్యాల... మద్యం మత్తులో వాహనం నడుపుతూ ట్రాఫిక్ అనలైజర్ పరీక్షలో 347 రీడింగ్ నమోదైన కుమ్మరి సురేష్‌ను ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.ఈ కేసును విచారించిన మంచిర్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రమేష్ బుధవారం నిందితుడికి రూ.3,000 జరిమానా విధించడంతో పాటు, ఒకరోజు పాటు మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఆదేశించారు.
ఈరోజు 8 డ్రంక్ అండ్ డ్రైవ్ (DD) కేసులను న్యాయమూర్తి విచారించి రూ.17,000 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి. హన్నన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వాహనదారుల ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లుతుందని తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ఒకరు చేసే తప్పుకు అమాయకులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఒక్కరి నిర్లక్ష్యం అనేక కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు.
వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలని, చిన్ననాటి నుంచే వారికి క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తన, సమాజంలో మంచి మార్గంలో నడుచుకునే విధానాలను నేర్పించాలని కోరారు.
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం.డి.హన్నన్ తెలిపారు.
🏠 Home