🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 7:39 am Posted by : TELANGANA KERATAM

ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

News Image
ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

 కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ పిలుపు

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 18:


నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్, మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమా దేవరెడ్డి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో భాగంగా చేపడుతున్న మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నం బియ్యం, రేషన్ కార్డులు, రైతు బరోసా, ఐకేపీ మహిళకు జీరో వడ్డీ రుణాలు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్యసేవలు, యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వంటి పథకాల గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు.అలాగే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా, వైద్య రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధిలను గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తలుసమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలనిపిలుపునిచ్చారు. రెండు మూడు రోజుల్లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు. ఈ పథకం ద్వారా కుటుంబ పెద్ద కు 5 లక్షల జీవిత బీమాను కల్పించనున్నట్లు తెలిపారు. అందరికీ వచ్చేలా అప్లికేషన్ పెట్టించే బాధ్యత తీసుకోవాలని ఇలాంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లిపార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ఏర్గట్ల మండల పరిధిలో నూతన పెన్షన్లు 371 వరకు వచ్చినవి, ఇంకా అర్హత యుండి తప్పిపోయినావారి వివరాలు తీసుకొని జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు ధనసరి సీతక్క దృష్టికి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీలన్న ద్వారా తీసుకవెళ్లి మంజూరుకు ప్రయత్నం చేద్దామని శివకుమార్ అన్నారు ఈ సమావేశంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, సొసైటీ చైర్మెన్, మాజీ కేఎంసీ డైరెక్టర్ , ఆలయ కమిటీ చైర్మన్ , ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home