🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 7:47 am Posted by : TELANGANA KERATAM

రాహుల్ గాంధీ హిందువునని చెప్పుకోవడం సిగ్గుచేటు

News Image
రాహుల్ గాంధీ హిందువునని చెప్పుకోవడం సిగ్గుచేటు

బిజెపి రాష్ట్ర నాయకులు మర్రిపెల్లి సత్యమ్

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : రామాయణం కల్పితం అంటూ, రామసేతు మానవ నిర్మితం అంటూ సుప్రీంకోర్టులో కేసును వాదించడానికి 36 మంది లాయర్లను మార్చిన సోనియాగాంధీ తనయుడు రాహుల్ గాంధీ నేను హిందు కుటుంబానికి చెందిన వాడినంటూ.. ప్రకటించడం సిగ్గుచేటని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు. రాహుల్ గాంధీ మెజార్టీ హిందువుల 500 ఏళ్ల రామ మందిరం నిర్మాణం కల సాకారం అయి మూడేళ్లు దాటినా, ఇప్పటివరకు ఎందుకు రామ మందిరం దర్శనానికి వెళ్లలేదని, బాబర్ సమాధిని దర్శించడానికి సోనియా, రాహుల్ గాంధీలకు సమయం దొరికింది కానీ, అయోధ్యలోని భవ్యమైన, దివ్యమైన రాంలల్లాను దర్శించడానికి సమయం దొరకలేదా అంటూ ప్రశ్నించారు. భోజనం చేసే సమయంలో తన తల్లి సోనియా తన తండ్రి రాజీవ్ గాంధీ తొడల పైన కూర్చునేదని, ఇంటి గుట్టు రట్టు చేసిన రాహుల్ ఇలాంటి విషయాల్లో హిందువులలో స్వేచ్ఛ లేదని, శివపార్వతుల ఫోటోతో పోల్చడం సిగ్గుచేటని అన్నారు. దేవతలు అంటే అవతార పురుషులని వారు చేసేవి లీలలనే సత్యాన్ని గ్రహించకుండా రాహుల్ మతిభ్రమించినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీని శివునితో పోల్చిన రాహుల్ గత పదేళ్ల క్రితం సోనియాగాంధీ వారణాసిలో రోడ్ షో చేస్తున్న సమయంలో షెడ్యూల్ ప్రకారం కాశీ విశ్వేశ్వరుని దర్శనానికి వెళ్లాల్సి ఉన్నా, అనారోగ్యం సాకుతో దర్శనం రద్దు చేసుకున్న సోనియా ఇప్పటివరకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. రాజీవ్, సోనియా గాంధీల వ్యక్తిగత విషయాలను బహిరంగపరిచిన రాహుల్ నోటి దూలను కవర్ చేసుకోవడానికి శివపార్వతుల ప్రతిమను షేర్ చేయడం దుర్మార్గమని, ఇది కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీయటమేనని అన్నారు. లోక కళ్యాణం కోసం శివుడు హాలాహలం మింగాడని, మరి రాజీవ్ గాంధీ అలాంటి పని చేశాడా అని అన్నారు. పార్లమెంటు సాక్షిగా హిందూ దేవి దేవతలను హింసావాదులనీ, అందుకే శివుడి చేతిలో త్రిశూలం, రాముడి చేతిలో బాణం, కృష్ణుని చేతిలో సుదర్శన చక్రం ఉంటుందని వ్యాఖ్యానించిన రాహుల్ ఇలాంటి ప్రకటనలతో రాజకీయ అజ్ఞాని అని నిరూపించుకున్నాడని ఎద్దేవా చేశారు. రెండు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ కొలంబియా యూనివర్సిటీ విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో భారత్ ఆర్థికంగా చాలా బలహీన దశలో ఉందని నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని వ్యాఖ్యానించడం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 11,వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను నరేంద్ర మోడీ నాలుగవ స్థానంలోకి తీసుకు వచ్చారని, గతంలో కంటే భారత దేశంలో పేదరికం 25 శాతం తగ్గిందని ప్రపంచ గణాంకాలు చెబుతున్న సమయంలో విదేశీ గడ్డపై స్వదేశీ పరువు తీసే వ్యాఖ్యలు చేయడం అతని అవివేకానికి నిదర్శనమని, అతనిని దగ్గరలోని పిచ్చాసుపత్రిలో చేర్పించాలని అన్నారు.

🏠 Home