🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 8:30 am Posted by : TELANGANA KERATAM

లక్ష్మిదేవిపల్లిలో నూతన చేయూత పెన్షన్ ప్రొసీడింగ్‌ల పంపిణీ

News Image
తెలంగాణ కెరటం – జగిత్యాల

లక్ష్మిదేవిపల్లిలో నూతన చేయూత పెన్షన్ ప్రొసీడింగ్‌ల పంపిణీ

సారంగాపూర్: మండలంలోని లక్ష్మిదేవిపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ ప్రొసీడింగ్‌లను గ్రామ సర్పంచ్ మేకల శేఖర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పెన్షన్ మంజూరు కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉపేందర్ పి ఎ సి ఎస్ చైర్మన్   నర్సింహా రెడ్డి, నాయకులు మహిపాల్ రెడ్డి, గ్రామ సెక్రటరీ,గ్రామ ప్రజలు, లబ్ధిదారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

రంజిత్ పాంపర్తి
తెలంగాణ కెరటం
జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జి
🏠 Home