🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 8:40 am Posted by : TELANGANA KERATAM

రాజ్యాంగ దినోత్సవ మరియు పుస్తక ఆవిష్కరణ మహా సభను విజయవంతం చేద్దాం

News Image
**రాజ్యాంగ దినోత్సవ మరియు పుస్తక ఆవిష్కరణ మహా సభను విజయవంతం చేద్దాం**

తెలంగాణ కెరటం మెట్ పల్లి పట్టణ ప్రతినిధి నవంబర్ 18

నవంబర్ 26 న రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని  డా కదిరే కృష్ణ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎల్  బి నగర్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో మహా సభను నిర్వహిస్తున్నారు ఈ సభకు ముఖ్య అతిధిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు విచ్చేస్తున్నారు.అంతే కాకుండా బాబా సాహెబ్  అంబేద్కర్ గారి మీద గత కొన్ని నెలల కింద వచ్చిన కల్పిత నాయకుడు అనే పుస్తకానికి ధీటుగా డా కదిరే కృష్ణ గారు రచించిన అధ్వితీయ నాయకుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అనే పుస్తకం యొక్క ఆవిష్కరణ కూడా అదే రోజు నిర్వహిస్తున్నారు. ఈ పుస్తకం యొక్క ఆవిష్కరణ కి బహుజన మేధావులు అందరు కూడా భారీగా తరలి రావాలని మహా సభ యొక్క పోస్టర్ ని మెట్ పల్లి లోని అంబేద్కర్ పార్క్ లో ఆవిష్కరించారు ఈ కార్యక్రమం లో బాంసెఫ్ నాయకులు నేత రవి,దయ్య రఘువీర్, రాజేష్ రక్షక్, కోరం నవీన్, సోమిడి కైలాష్, సోమిడి శ్యామ్ సాహు, ఆసతి శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home