🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 9:14 am Posted by : TELANGANA KERATAM

సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి : నీలం మధు ముదిరాజ్.. సభా స్థలాన్ని పరిశీలించిన నీలం..

News Image
సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలి : నీలం మధు ముదిరాజ్..
సభా స్థలాన్ని పరిశీలించిన నీలం..
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 18, నవంబర్
సిద్దిపేటలో రేపు నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన సిద్దిపేటలోని సీఎం సభా స్థలాన్ని అక్కడే ఉన్న మంత్రివర్యులు దామోదర రాజా నరసింహ, స్థానిక ఇంచార్జ్ పూజల హరికృష్ణ గార్లతో కలిసి పరిశీలించారు. భారీ సంఖ్యలో ప్రజలు సభకు హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు అధికారులు చేపడుతున్న సరే కాంగ్రెస్ శ్రేణులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని నాయకులకు సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని శ్రేణులకు తెలిపారు.
ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సీఎం ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చూడాలని అధికారులను, పార్టీ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home