🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 11:32 am Posted by : TELANGANA KERATAM

త్వరలో పార్ట్ టైం ఉపాధ్యాయుల వేతనాలు పెంపు

News Image
త్వరలో పార్ట్ టైం ఉపాధ్యాయుల వేతనాలు పెంపు 

- వచ్చే నెల నుంచి పెరిగే అవకాశం
- ఆర్థిక శాఖ దగ్గర ఫైల్ పెండింగ్
- త్వరలో ముఖ్యమంత్రిని కలవనున్న మంత్రి లక్ష్మణ్
- సంతోషం వ్యక్తం చేస్తున్న పార్ట్ టైం టీచర్లు
-త్వరలో క్లియర్ చేయాలి జిల్లా అధ్యక్షుడు మహేష్ 

 తెలంగాణ కెరటం,తాండూర్ ప్రతినిధి: నా శాఖ లో అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా పరిస్కరిస్తా అని  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. నిన్న పార్ట్ టైం ఉపాధ్యాయులు మంత్రి అడ్డూరి లక్ష్మన్ను కలిసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మరియు ఫ్రెండ్లీ ప్రభుత్వం అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గా తన శాఖలో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగకుండా చూడడమే తన బాధ్యత అని పార్ట్ టైమ్ ఉపాధ్యాయులు రాష్ట్ర సంఘం సభ్యులు కలసిన సందర్భంగా అన్నారు. 2006 నుండి పనిచేస్తున్న వారి నీ చాలాకాలంగా పనిచేస్తున్న వారిని ఎం టీ ఎస్ చేయడానికి ప్రభుత్వం లో ముఖ్యమంత్రితో మాట్లాడి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తానని  మంత్రి హామీ ఇచ్చారు.అక్కడే ఉన్న ఒస్డ్ కి వెంటనే ఈ నెల 23 వరకు ఫైల్ రెడీ చేయాలని తెలియజేశారు.
వేతన పెంపు అమలు కావడం లేదని అది ఇంకా ఆర్థిక శాఖ యందు పెండింగ్లో ఉందని పార్ట్ టైం ఉపాధ్యాయులు మంత్రికి వివరించారు.ఈ నెలాఖరులోగా అటు ఇటుగా వస్తుందని ఎవరు నిరాశకు గురికాకూడదని మంత్రి. తెలియజేశారు.సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారికి  పరీక్షలు,డెమోలు రాసి సేవలు అందించిన వారిపట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. వారికి ఆటో రెన్యూవల్ తీసుకు వస్తామని తెలియజేశారు.ఇందులో  రాష్ట్ర అధ్యక్షులు శరణప్ప, ఉపాధ్యక్షులు జ్యోత్స్న ,కార్యదర్శి పూనం , జమాల్ ,భాస్కర్ విజయలక్ష్మి .శ్రీలత ప్రశాంత్ లు పాల్గొన్నారు.

మాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉంది.


 గత నెలనుండి పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల వివరాలను అంతర్గతంగా సేకరించడం మాకు చాలా సంతోషనిస్తుందని మాకు తప్పకుండా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందనే నమ్మకం ఉందని పార్ట్ టైమ్ ఉపాధ్యాయుల మంత్రికీ , ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం డెమోలు నిర్వహించకుండా వాళ్లనే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాము. పార్ట్ టైం ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా చూడాలి.ఉద్యోగ భద్రత కల్పించాలి.
-రాష్ట్ర గురుకులాల అధ్యక్షుడు,యు శరణప్ప.

 త్వరలో వేతనాల పెంపు సంతోషకరం 

 ప్రస్తుతం అన్ని ధరలు పెరిగిన కారణంగా మాకు కూడా వేతనాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. గత మే నెలలో ప్రభుత్వం జీతాలు పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ అమలు చేయడం మర్చిపోయారు . దయచేసి వచ్చే నెల నుంచి వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి మరియు మంత్రికి తెలియజేస్తున్నాను. ఆర్థిక శాఖ దగ్గర ఫైల్ పెండింగ్లో ఉన్నదని త్వరలో పరిష్కరిస్తానని తెలిపిన మంత్రిగారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆటో రెన్యువల్, మహిళలకు ప్రసూతి సెలవులు, రానివాళ్లకు ఐఎంఎఫ్ఎస్ నెంబర్ కూడా త్వరలో రావాలని కోరుకుంటున్నాము.

- మహేష్, వికారాబాద్ జిల్లా గురుకులాల అధ్యక్షుడు
-
🏠 Home