🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 12:12 pm Posted by : TELANGANA KERATAM

విబిజీ రాంజీ పథకంపై మేట్లకు శిక్షణ కార్యక్రమం

News Image
విబిజీ రాంజీ పథకంపై మేట్లకు శిక్షణ కార్యక్రమం

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : కోరుట్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ పథకానికి సంబంధించి మేట్లకు విబిజీ రాంజీ పథకంపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వోదెల రామకృష్ణ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా నిర్వహించడంలో మేట్ల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. నూతనంగా అమలులోకి వస్తున్న విబిజీ రాంజీ పథకంలోని నిబంధనలు, విధివిధానాలు, మేట్ల బాధ్యతలు, విధులపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మేట్లు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ, ప్రతి కూలీకి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం పనులు కల్పించేలా కృషి చేయాలని ఎంపీడీవో సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం నాణ్యత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఎంపీడీవో వోదెల రామకృష్ణ తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా విబిజీ రాంజీ పథకం లక్ష్యాలు, నిబంధనలు, కూలీల హాజరు నమోదు, మస్టర్ నిర్వహణ, కొత్త జాబ్ కార్డుల జారీ, పాత జాబ్ కార్డుల పరిశీలన, ఈ-కేవైసీ, పని కోరిన కూలీలకు పనుల కేటాయింపు, పనుల కొలతలు, డిమాండ్ ప్రకారం పనుల కల్పన, ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల హాజరు నమోదు, పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స వంటి మౌలిక సదుపాయాల కల్పన,.కూలీలకు 125 రోజుల పని కల్పనకు సంబంధించిన అంశాలు, కూలీల వేతనాలు, మెటీరియల్ ఖర్చులు, పనుల నాణ్యతపై అవగాహన, గ్రామాల్లో చేపట్టే పనుల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజశేఖర్, ఇన్‌చార్జి ఏపీఓ దారాసింగ్, టీఏ స్రవంతి, కంప్యూటర్ ఆపరేటర్ రాజేందర్, వివిధ గ్రామాలకు చెందిన మేట్లు పాల్గొన్నారు.
🏠 Home