ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ నెల 19,వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 05 లక్షల రూపాయలు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను ప్రారంభించినట్లు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబములో కుటుంబ పెద్దకు జీవిత బీమా పథకం వర్తిస్తుందని, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో అర్హత గల వారి వయస్సు 18 నుండి 59 సంవత్సరాల మద్య ఉన్న వారు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఈ పథకంలో నమోదు చేసుకునే సమయంలో బీమాదారుని ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతిని తప్పనిసరిగా తీసుకురావాలని, అలాగే కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు నంబర్లు, ఆహార భద్రత కార్డు లేదా రేషన్ కార్డు (ఉంటే), మొబైల్ నంబర్, నామినికి సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నామినీ మైనర్ అయిన సందర్భంలో అపాయింటీ ఆధార్ కార్డు వివరాలు కూడా సమర్పించాలని పేర్కోన్నారు. పట్టణ ప్రజలు ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ రాఘవేంద్ర సూచించారు.