🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 2:18 pm Posted by : TELANGANA KERATAM

22,వ వార్డు లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ

News Image
22,వ వార్డు లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 18 : జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్‌లో 22,వ వార్డుకు చెందిన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల ఉత్తర్వు పత్రాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, 22,వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మిలు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులకు చేయూత పెన్షన్లు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు లబ్ధిదారులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home