యాసంగి లో నీటి లభ్యత ఆధారంగానే పంటలు సాగు చేయాలి
*యాసంగి లో నీటి లభ్యత ఆధారంగానే పంటలు సాగు చేయాలి*
*సహాయ వ్యవసాయ అధికారి (కోస్గి ADA). నూతన్ కుమార్*
తెలంగాణ కెరటం నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 18
మద్దూరు మండలంలోని పెద్రిపహాడ్ గ్రామంలో ఖేత్ బచావో అభియన్ భూమి సంరక్షణ కార్యక్రమం లో భాగంగా బుధవారం పెద్రిపహడ్ రైతువేదిక దగ్గర సాగు భూముల సంరక్షణ, నేల ఆరోగ్య పరిరక్షణ ,పంటల మార్పిడి పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ అధికారి శ్రీ నూతన్ కుమార్ గారు మాట్లాడుతూ రాబోయే యాసంగి సీజన్లో *ఏల్ నినో* ప్రభావం కారణంగా వర్షపాతం నీటి లభ్యత తో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నీటి వనరుల లభ్యతను అంచనా వేసుకుని విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని పంటల సాగుపై నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. యాసంగిలో అధిక నీటిని వినియోగించే వరి పంట సాగును సాధ్యమైనంత వరకు తగ్గించి నీటి అవసరం తక్కువగా ఉండే సెనగ, పెసర, మినప మరియు కూరగాయలు వంటి పంటలు సాగు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నేల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సేంద్రీయ పదార్థాలను వినియోగాన్ని పెంచాలని , పంట అవశేషాలను నేలలో కలియదున్నలని ఈ నేల పరీక్షల ఆధారంగా సమతుల్యత ఎరువులను వినియోగించాలని అలాగే ఫార్మార్ రిజిస్ట్రేషన్ చేసుకొని రైతులు కచ్చితంగా చేసుకోవాలని. రైతులకు సూచించారు అనంతరం గ్రామం లోని ఆశప్ప యొక్క వేరుశనగ పొలాన్ని సందర్శించి కావలిసిన సస్యరక్షణ చర్యలు రైతు కు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్. గ్రామ సర్పంచ్ అనసూజ తారాసింగ్ , గ్రామ ఉపసర్పంచ్ నరసింహ , గ్రామ ప్రజాప్రతినిధులు మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు....