🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 5:44 pm Posted by : RAM VENU

ఎ.ఐ.టి.యు.సి 43వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

News Image

జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు

తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.
 ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు బెంగళూరులో జరగనున్న ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎ.ఐ.టి.యు.సి ) 43వ జాతీయ మహాసభలను కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఎ.ఐ.టి.యు.సి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు కార్మికవర్గాన్ని కోరారుఈ సందర్భంగా సి.పి.ఐ కార్యాలయంలో ఎ.ఐ.టి.యు. సి 43వ జాతీయ మహాసభల పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా మేకల దాసు మాట్లాడుతూ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కంటే అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. కార్మికులు దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులకు విఘాతం కలిగించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని అన్నారు.శ్రీరాముడి నామస్మరణ చేస్తూ రామరాజ్యం గురించి మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు లక్షలాది మంది కార్మికులకు కనీస వేతనాలు కూడా అందించకపోవడం ఏ విధమైన రామరాజ్యమని ప్రశ్నించారు.ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు, మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు, మిషన్ భగీరథ ఉద్యోగులు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కుల సాధన, కనీస వేతనాల అమలు, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత, స్కీమ్ వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు వంటి కీలక అంశాలపై ఎ.ఐ.టి.యు.సి జాతీయ మహాసభల్లో చర్చించి భవిష్యత్తు కార్మిక ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
కార్మికుల ఐక్యతను చాటుతూ ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని మేకల దాసు పిలుపునిచ్చారు.ఎ.ఐ.టి.యు.సి జిల్లా ఉపాధ్యక్షులు మిట్టపల్లి పౌలు,కొమురయ్య,ఆర్ వెంకన్న, అరుణ,కాంత కృష్ణ,రాయమల్లు లు పాల్గొన్నారు.
🏠 Home