🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 6:10 pm Posted by : TELANGANA KERATAM

కుటుంబ జీవిత భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

News Image

గ్రామాల వారీగా 04 ఫేజ్‌లలో దరఖాస్తుల స్వీకరణ

కోరుట్ల ఎంపీడీవో వోదెల రామకృష్ణ

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 19 : కోరుట్ల మండలంలోని మొత్తం 15 గ్రామ పంచాయతీల పరిధిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణను 04 ఫేజ్‌లలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎంపీడీవో వోదెల రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి ఫేజ్ లో ధర్మారం, తిమ్మాయిపల్లి, సంగెమ్, గుమ్లాపూర్, రెండవ ఫేజ్ లో సర్పరాజపల్లి, కల్లూరు, జోగినపల్లి, మాదాపూర్, మూడవ ఫేజ్ లో వెంకటాపూర్, పైడిమడుగు, మోహన్‌రావుపేట, యూసఫ్ నగర్, నాలుగవ ఫేజ్ లో నాగులపేట, ఐలాపూర్, చిన్న మెట్‌పల్లి గ్రామాల్లో మండలంలోని మొత్తం 15 గ్రామ పంచాయతీలలో గ్రామాల వారీగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. కుటుంబ యజమానులందరూ తమకు కేటాయించిన ఫేజ్ ప్రకారం అవసరమైన పత్రాలతో గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసే క్యాంపులకు హాజరై, దరఖాస్తులు సమర్పించి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

🏠 Home