🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 6:29 pm Posted by : TELANGANA KERATAM

నిరుపేద విద్యార్థులకు అండగా ఎన్ఎన్ వెల్ఫేర్ సొసైటీ

News Image

మదర్సా విద్యార్థులకు చాలీ దుస్తుల పంపిణీ..

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 19 : నిరుపేద కుటుంబాలకు చెందిన మదర్సా విద్యార్థులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఎన్ఎన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు చాలీ దుస్తులు పంపిణీ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త అహ్మద్ అబ్దుల్ నయీమ్, జామే మసీదు కమిటీ అధ్యక్షుడు ఎం.డి మసీఉద్దీన్ లతో కలిసి విద్యార్థులకు దుస్తులను అందజేశారు. సమాజంలోని పేద, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి తోడ్పాటు అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా నిరుపేద కుటుంబాల పిల్లలకు చిన్నపాటి సహాయం అందించినా అది వారి కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎన్.ఎన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఏ.ఏ.అక్రమ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు ప్రశంసించారు. భవిష్యత్తులోనూ పేద విద్యార్థులు, నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త అహ్మద్ అబ్దుల్ నయీమ్, ఎన్.ఎన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అక్రమ్, కౌన్సిలర్ స్రోగ్రాబి, మోసిన్, రహీం, జామే మసీదు కమిటీ అధ్యక్షుడు ఎం.డి. మసీ ఉద్దీన్, సెక్రటరీ నయీమ్ ఉద్దీన్, ఇలియాస్ అహ్మద్ ఖాన్, జావీద్ అలీ, షబ్బీర్, అంజాద్ అలీ, షకీల్ అహ్మద్, సాజిద్, మహమ్మద్ సాదీక్, అమానుల్లా, భారీ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home