🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 6:43 pm Posted by : TELANGANA KERATAM

రైతులకు అండగా పంటనష్టంపై ప్రత్యేక దృష్టి.

News Image
తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 19):
ఎల్‌నినో ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు పంటనష్టం అంచనా, పరిహారం అందేలా చర్యలు చేపట్టడంతో పాటు, అచ్చంపేట నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అచ్చంపేట నియోజకవర్గ వ్యవసాయ శాఖ డీ ఏవో, ఏడి, ఏఓలతో లతో టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు & అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జూo సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేలా పంటనష్టం వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా సేకరించి, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సహాయం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పంటనష్టం వివరాలు, రైతుల సమస్యలు, ప్రభుత్వ సహాయం అందించే విధానంపై సమగ్రంగా సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేస్తూ. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.
అని రైతుకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తెలిపారు.
🏠 Home