🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 6:49 pm Posted by : TELANGANA KERATAM

కొండగట్టు చందనోత్సవాలకు పటిష్ట పోలీస్ బందోబస్తు!

News Image
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక భద్రతా చర్యలు
బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్
జగిత్యాల జిల్లా: మల్యాల: ప్రతినిధి బి.రఘు _
 కొండగట్టు శ్రీ అంజనేయస్వామి ఆలయంలో నిర్వహించనున్న చందనోత్సవాల సందర్భంగా ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్, ఇతర శాఖల అధికారులతో కలిసి కొండగట్టు ఆలయ పరిసర ప్రాంతాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, క్యూలైన్ల నిర్వహణ, భక్తుల రాకపోకలపై అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుని సురక్షితంగా తిరిగి వెళ్లేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఆలయ పరిసర ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఉంచాలని, రద్దీ ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టిఆలయానికి వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రధాన రహదారులు, ఆలయ మార్గాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని తెలిపారు.సమన్వయంతో విధులు నిర్వహించాలి బందోబస్తులో పాల్గొనే ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమకు కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, మల్యాల సీఐ రాజ్ కుమార్, ఎస్సైలు సందీప్, నరేష్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home