🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 6:53 pm Posted by : TELANGANA KERATAM

శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం

News Image
శ్రీ సరస్వతీ విద్యా మందిర్ విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు

తెలంగాణ కెరటం 
19 నవంబర్ 
కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా కేంద్రం లో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అనుగ్రహ భాషణం
జిల్లా కేంద్రం లోని స్థానిక శ్రీ సరస్వతీ విద్యా మందిర్ హైస్కూల్ కామారెడ్డి లో గురువారం రోజున బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు విద్యార్థులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదని తెలిపారు. లక్ష్య సాధనలో హనుమంతున్ని ఆదర్శంగా తీసుకోవాలని ,సమయాన్ని వృధా చేయకూడదని తెలిపారు. అనవసర విషయాల జోలికి వెళ్లకూడదని తెలిపారు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించ కూడదని అన్నారు. తల్లి యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించారు. తల్లి నవమాసాలు మోసి పురిటి నొప్పులను భరించి బిడ్డలకు కంటుందని అన్నారు. పుట్టిన బిడ్డని చూడగానే, తల్లి తన నొప్పులను మర్చిపోతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ సామల గంగారెడ్డి (పాఠశాల ఉపాధ్యక్షులు), శ్రీ అర్కల మల్లేష్ యాదవ్ (పాఠశాల కార్యదర్శి), శ్రీ బొడ్డు శంకర్ (సంచాలన సమితి అధ్యక్షులు), శ్రీ గీరెడ్డి రాజి రెడ్డి (జిల్లా కార్యదర్శి), శ్రీ హరిస్మరణ్ రెడ్డి (ప్రాంత పూర్వ విద్యార్థి పరిషత్ అధ్యక్షులు), శ్రీ పక్కి శ్రీనివాస్ (ఇందూర్ విభాగ్ శైక్షణిక్ సంయోజక్), పాఠశాల కమిటీ సహకార్యదర్శి శ్రీ రణజిత్ మోహన్, కోశాధికారి శ్రీ ప్రతాప్ గౌడ్, ,శ్రీ శేట్పల్లి భాస్కరరావు, శ్రీ నిత్యానందం, శ్రీ గోపాలకృష్ణ, శ్రీ బద్దం అనిల్ రెడ్డి , శ్రీ ఎస్. ఎన్ .చారి, శ్రీ నారా గౌడ్, శ్రీ గోవర్ధన్ రెడ్డి, శ్రీ ముప్పారపు ఆనంద్ (శిశు మందిర్ భగత్ సింగ్ నగర్ పాఠశాల అధ్యక్షులు), శ్రీ ధనుంజయ (భగత్ సింగ్ నగర్ పాఠశాల సంచాలన సమితి అధ్యక్షులు), శ్రీ నల్ల నాగభూషణం (పాఠశాల ప్రధాన చార్యులు) ,శ్రీ నాగేష్ పాఠశాల (అకాడమిక్ ప్రిన్సిపల్), ఆచార్య బృందం ,విద్యార్థులు పాల్గొన్నారు
🏠 Home