వంగాలపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 19 వంగాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూక్య మేనక సుధాకర్ నాయక్ , గ్రామ ఉపసర్పంచ్ అరూరి రవి చందర్ , వార్డ్ సభ్యులు, గ్రామ అధ్యక్షులు మాట్యాడ అశోక్ , గ్రామ కార్యదర్శి మమత పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా గ్రామపంచాయతీ పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.