ఆర్టీసీ బస్సుల్లో లేని ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్.
నామ్ కి వస్తే ఫస్ట్ ఎయిడ్ బాక్స్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 19):ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్రధమ చికిత్స బాక్స్‌లలో మందులు ఉండడం లేదు. మోటార్ వాహనాల నిబంధనల ప్రకారం ఫస్ట్ ఎయిడ్ కిట్, అయోడిన్, డ్రెస్సింగ్ ప్యాడ్స్, కాటన్, బ్యాండేజ్ లు, ఉండాలి కానీ ఆర్టీసీ అధికారులు వీటిని అందుబాటులో ఉంచడం లేదు దీంతో ప్రమాదం జరిగితే ప్రయాణికులకు చికిత్స ఎలా అని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి ఆర్టీసీ బస్సులలో ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్లో కిడ్స్ ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.