ఎన్ ఆర్ పి కాలనీలో రూ.2 కోట్ల 80 లక్షలతో చేపడుతున్న నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనుల పరిశీలన
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 19, నవంబర్
నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలి: మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్జే పీ కాలనీ డివిజన్ పరిధిలోని ఎన్ ఆర్ పి కాలనీలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో సుమారు రూ.2 కోట్ల 80 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఈరోజు గురువారం పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని, రోడ్ల నాణ్యతను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం కాలనీవాసులతో మాట్లాడిన మెట్టు కుమార్ యాదవ్ కాలనీలో మరికొన్ని రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయని, వాటి కారణంగా ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు వివరించారు. మిగిలిన రోడ్లను కూడా నూతనంగా నిర్మించి కాలనీలో పూర్తిస్థాయిలో మెరుగైన రహదారి సదుపాయాలు కల్పించాలని కోరారు.
దీనిపై స్పందించిన మెట్టు కుమార్ యాదవ్ కాలనీవాసుల సమస్యలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి, సాధ్యమైనంత త్వరగా మిగిలిన రోడ్ల నిర్మాణానికి కూడా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అనారోగ్యంతో బాధపడుతున్న శివకు పరామర్శ
రోడ్ల నిర్మాణ పనుల పరిశీలన అనంతరం ఎన్ ఆర్ పి కాలనీకి చెందిన శివ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న మెట్టు కుమార్ యాదవ్ వారి నివాసానికి వెళ్లి శివను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు.ఈ సందర్భంగా శివ ధైర్యం చెబుతూ అధైర్యపడవద్దని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, మెరుగైన వైద్య చికిత్స తీసుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. అభివృద్ధితో పాటు ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే బాధ్యత నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందిస్తున్న సహకారంతో ప్రతి డివిజన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందుల సమయంలోనూ వారికి అండగా నిలవడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ ప్రతినిధులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.