🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 7:37 pm Posted by : TELANGANA KERATAM

ప్రతి బూత్ ఒక కోట... ప్రతి కార్యకర్త ఒక సైనికుడు : సాయిని మల్లేశం

News Image
జగిత్యాల జిల్లా / మల్యాల మండల ప్రతినిధి - బి. రఘు
ప్రతి బూత్ ఒక కోట... ప్రతి కార్యకర్త ఒక సైనికుడు : సాయిని మల్లేశం
మల్యాల, నవంబర్ 19 :* "2028 యుద్ధానికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. ప్రతి బూత్ ను ఒక కోటలా మార్చాలి. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పోరాడాలి. అప్పుడే తెలంగాణ గడ్డపై కమలం వికసిస్తుంది" అని బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మల్యాల మండలం నూకపల్లి - రాజారం శక్తి కేంద్రంలో బుధవారం నిర్వహించిన నెలవారీ శక్తి కేంద్ర మీటింగ్ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయిని మల్లేశం, బూత్ స్థాయి నుంచే విజయానికి పునాది పడుతుందని స్పష్టం చేశారు.బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు కేవలం పేర్లకే పరిమితం కాకూడదని, అవి క్షేత్రస్థాయిలో పనిచేసే శక్తి కేంద్రాలుగా మారాలని అన్నారు. ప్రతి కార్యకర్త తన బూత్ లోని ప్రతి ఓటరును కలిసి, వారి కష్టసుఖాలు తెలుసుకుని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేయాలని దిశానిర్దేశం చేశారు.ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంలో కార్యకర్తలే కీలక పాత్ర పోషించాలని, గ్రామగ్రామాన పార్టీ జెండాను మోయాలని సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర కృషి ఉంటే 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం, మద్దుట్ల సర్పంచ్ సంకుర్తి తిరుపతి, బీజేవైఎం మండల అధ్యక్షుడు పొన్నగంటి గౌతం, నులుగొండ సురేష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు బొమ్మన పరమేష్, వేణు, మహేష్, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
🏠 Home