🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 7:42 pm Posted by : TELANGANA KERATAM

పుట్టినరోజు వేడుకలు కాదు… మనం చేసే మంచి పనులే శాశ్వత జ్ఞాపకాలు!

News Image
జన్మదిన శుభాకాంక్షల వెనుక ఒక గొప్ప జీవిత సందేశం ఉండాలి!
 తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 19 :
ప్రతి సంవత్సరం మన జన్మదినం రాగానే ఎంతో ఆనందంగా, సంతోషంగా కేకులు కట్ చేస్తూ, పూలమాలలు వేసుకుంటూ, శాలువాలతోసత్కరించుకుంటూ,స్నేహితులు, బంధువుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటూ వేడుకలు జరుపుకుంటాం.
కానీ ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మరో సంవత్సరం మన జీవితంలో గడిచిపోయింది. మన జీవితకాలం నుంచి ఒక సంవత్సరం తగ్గిపోయింది. ఈ గడిచిన సంవత్సరంలో సమాజానికి మనం చేసిన మంచి పని ఏమిటి? పేదవారికి అందించిన సహాయం ఏమిటి? విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసిన కృషి ఏమిటి? ఆపదలో ఉన్నవారికి అందించిన అండ ఏమిటి?మనిషి పుట్టినరోజు జరుపుకోవడం గొప్ప విషయం కాదు. మనం పుట్టినందుకు ఈ సమాజం గర్వపడేలా జీవించడం అసలైన గొప్పతనం.చరిత్రలో ఎందరో మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్తలు, విద్యావేత్తలు, ప్రజాసేవకులు నేడు మన మధ్య లేకపోయినా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రజలు ఎంతోగౌరవంగానిర్వహిస్తున్నారుఎందుకంటే వారు తమ జీవితాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసం అంకితం చేశారు.వారు సంపాదించిన ఆస్తులు కాదు, వారు సమాజానికి అందించిన సేవలు వారిని చిరస్మరణీయులుగా నిలబెట్టాయి.అదే విధంగా మనం కూడా జీవించి ఉన్నప్పుడే సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి. నిరుపేద విద్యార్థులకు చదువులో సహాయం చేయాలి. పేద కుటుంబాలకు అండగా నిలవాలి. అనాథలకు తోడుగా ఉండాలి. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలి. గ్రామాభివృద్ధికి కృషి చేయాలి. కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పాలి.మన పుట్టినరోజు సందర్భంగా వందల మందికి భోజనాలు పెట్టడం కంటే, ఒక నిరుపేద విద్యార్థి చదువుకు చేయూతనివ్వడం మరింత విలువైనది. ఖరీదైన కేక్ కట్ చేయడం ఒక పేద కుటుంబంలో వెలుగులు నింపడం గొప్పది పూలమాలలతోసత్కరించుకోవడం కంటే ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం ఎంతో గొప్పది. మనిషి పుట్టుక సహజం మరణం కూడా సహజం కానీ మనిషి జీవించిన విధానం, చేసిన సేవలు చూపించిన మానవత్వం మాత్రమే తరతరాలకు గుర్తుండిపోతాయి. మన మరణం తర్వాత మన ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించడమే కాదు. మనం చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాల తరాలు మన జన్మదిన జయంతిగా మన సేవలను స్వరవించుకుంటూ వర్ధంతిని నిర్వహించే స్థాయికి ఎదగాలి అందుకే జన్మదిన శుభాకాంక్షలు చెప్పేటప్పుడుఆయురారోగ్యాలుసుఖసంతోషాలు మాత్రమే కాకుండా సమాజానికిఆదర్శంగా నిలిచే జీవితాన్ని గడపాలని కోరుకుందాం.చివరగా ఒక్క మాట మనిషి చనిపోయిన తర్వాత అతని సంపద వెంటరాదు హోదా వెంటరాదు అధికారం వెంటరాదు కానీ అతను చేసిన మంచి పనులు అందించిన సేవలు సంపాదించిన ప్రజాభిమానం మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి పుట్టినరోజు అంటే వయసు పెరగడం కాదు సమాజం కోసం మన బాధ్యత పెరగటం జీవించి ఉన్నప్పుడు మనిషిగా గుర్తింపు పొందాలి మరణించిన తర్వాత మహనీయుడుగా ప్రజల అభివృద్ధిలో నిలిచిపోవాలి.
🏠 Home