🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 8:00 pm Posted by : TELANGANA KERATAM

ఇసుక దందా చేసి సొమ్ము చేసుకొనే సునీల్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి పై ఆరోపణలు చేసే అర్హత లేదు

News Image
ఇసుక దందా చేసి సొమ్ము చేసుకొనే సునీల్ రెడ్డికి 
ప్రశాంత్ రెడ్డి పై ఆరోపణలు చేసే అర్హత లేదు
కాంగ్రెస్ పార్టీ అధికారం లో వచ్చిన 3 ఏండ్లైన అభివృద్ధి శూన్యం
తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 19:
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో పత్రిక విలేకరుల సమావేశంలో మోర్తాడ్, ఏర్గట్ల ఉమ్మడి మండలాల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో .మండల పార్టీ అధ్యక్షులు రాజా పూర్ణానందం, కల్లెడ ఏలియా మాజీ జడ్పీటీసీ గుల్లె రాజేశ్వర్ మాట్లాడుతూ...
మాజీ మంత్రి ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన అనుచిత వాక్యాలు చేయడమే పనిగా పెట్టుకొని ప్రజల యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా అసత్య ఆరోపణలు చేస్తూనారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో బాల్కొండ నియోజకవర్గంలోని పల్లెలో ఎలాటి అభివృద్ధి జరగలేదని పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి ఎన్నో వేలాది కోట్ల రూపాయలు నిధులు తీసుకువచ్చి పల్లెలను అభివృద్ధి చేశారని తాగునీటి సౌకర్యాలకి, మౌలిక వసతులకు, గ్రామాల్లో రవాణా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్న బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉండి అభివృద్ధికి ఇలాంటి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశావు తెలుపాలన్నారు. 
అభివృద్ధి చేయడం పక్కనబెట్టి బాల్కొండ నియోజకవర్గంలోని పెద్దవాగు పరివాహ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలలో కాంగ్రెస్ నాయకులతో ఇసుక దందా చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నావు, ఈ కార్యకర్తలతో అక్రమ వసూలు చేస్తూ పబ్బం గడుపుతున్నావు, ఎరుగట్ల మండలం బట్టాపూర్ తోర్తీ గ్రామాల్లో నీ కార్యకర్తలతో ఉసుక దందా నడిపిస్తూ నీ గడి నింపుకుంటూ నావు, ఇసుక తరలించే ఒక్కో ట్రాక్టర్ ట్రిప్‌కు రూ.600 వరకు వసూలు చేస్తు ఇసుక వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు చేస్తూన్న కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సునీల్ రెడ్డి గారా లేక ఊసేకే తక్కువ ధరకే నిపిస్తున్నాం అని బహిరంగ గా మాట్లాడుతున్న మీ నాయకుల ప్రజలకు సమాధానం చెప్పాలి
పెద్దవాగు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఇసుక తవ్వాలి, ఎక్కడ నుంచి తరలించాలి, ఒక్క ట్రిప్‌కు ఎంత ధర వసూలు చేయాలి అనే విషయాలను మోర్తాడ్‌లోని నీ గడిలో నిర్ణయిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారు నిర్ణయించిన ధరకు ఇసుక ఇవ్వడానికి అంగీకరించని వారిపై ఇసుక సరఫరా నిలిపివేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు,తరలింపులుజరుగుతున్నాయా? ఒక్కో ట్రిప్‌కు వసూలు చేస్తున్న రూ.600 ఎక్కడికి వెళ్తోంది? ఈ వసూళ్ల వెనుక ఎవరెవరి పాత్ర ఉంది? అనే అంశాలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నాము.ఇకనైనా వ్యక్తిగత దూషణలు మానుకొని మీ ప్రభుత్వం అధికారం లో ఉంది కావున అభివృధి కోసం నిధులు తీసుకువచ్చి పల్లెలను అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నా మని, అనవసర వాక్యాలు చేస్తే బిఆర్ఎస్ కార్యకర్తల సహించేది లేదని ఖబర్దార్ ఇకనైనా ఆరోపణలు మానుకొని అభివృద్ధి పై దృష్టి సాధించాలని కోరారు.
🏠 Home