🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 8:06 pm Posted by : TELANGANA KERATAM

రక్తదానం చేసిన యువకుడికి అభినందనలు

News Image
జగిత్యాల జిల్లా/*మల్యాల/ ప్రతినిధి / బి.రఘు :
మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించిన సంఘటన మల్యాల మండలంలో చోటుచేసుకుంది.
మద్దుట్ల గ్రామానికి చెందిన బండారి నాగరాజు గారు సర్జరీ నిమిత్తం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు అత్యవసరంగా రక్తం అవసరమైంది. విషయం తెలియగానే మనాల గ్రామానికి చెందిన యువకుడు కండ్లే జగదీష్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారు.తాను స్వయంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి, నాగరాజు గారి ప్రాణాలను కాపాడేందుకు సహాయపడ్డారు. అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచిన జగదీష్ ను గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అభినందిస్తున్నారు.రక్తదానం అంటేనే ప్రాణదానం. జగదీష్ చేసిన ఈ మంచి పని యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు కొనియాడుతున్నారు. నాగరాజు గారు త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
🏠 Home