🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 8:25 pm Posted by : TELANGANA KERATAM

ఆదివాసి యువకుడు తెల్లం శరత్ ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

News Image

నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని
మన్యసీమ పరిరక్షణ సమితి – డోలు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈసం యాదయ్య.
ములుగు జిల్లా బ్యూరో (తెలంగాణ కెరటం) నవంబర్ 19:భద్రాచలం లాడ్జి వద్ద ఆదివాసి యువకుడు తెల్లం శరత్ హత్యకు గురైన ఘటనను మన్యసీమ పరిరక్షణ సమితి – డోలు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈసం యాదయ్య తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివాసి యువకుడు తెల్లం శరత్ హత్యకు కారణమైన నిందితులను, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అలాగే, విచారణలో ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాల నిరోధక చట్టం (ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం) వర్తించే అంశాలు వెల్లడైతే ఆ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు.ఆదివాసి యువకుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ న్యాయం చేయడంతో పాటు తగిన ఆర్థిక పరిహారం అందించాలని, కుటుంబానికి ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆదివాసీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈసం యాదయ్య స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మన్య సీమ జిల్లా అధ్యక్షులు ఈసం రాజు, మన్య సీమ ఉపాధ్యక్షులు ఆక తిరుమలరావు, ప్రధాన కార్యదర్శి తోలేం సుధాకర్, మన్యసీమ జిల్లా కార్యదర్శి ఈసం కృష్ణ కుమార్, మన్యసీమ మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు, ఇర్ప చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home