ఆక్యుపై ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ పిలుపు
డిసెంబరు 1,2,3 చలో ఢిల్లీ పోస్టర్ల ఆవిష్కరణ
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం ఇందిరా రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర బిజెపి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ ఒకటి. రెండు. మూడు. తేదీలలో ఆక్యుపై ఢిల్లీ పోరాటం పెద్ద ఎత్తున జరుగుచున్నది. ఈ పోరాటంలో లక్షలది మంది కార్మికులు ఢిల్లీలో కదం తొక్క పోతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కార్మికులకు వ్యతిరేకమైన పొట్టలు కొట్టే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కనీస వేతనంగ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సవరించి 42 వేలకు పెంచాలి. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి. ప్రైవేటీకరణ ఆపాలి. 10 గంటల పని దినము జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనివెడల మోడీ ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాబాయ్ లక్ష్మి సిద్ధమ్మ సుజాత శివ జ్యోతి గౌరీ సరోజ హైమావతి యాదమ్మ సుమలత లావణ్య మంజుల తదితరులు పాల్గొన్నారు