🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 19 November 2026, 8:52 pm Posted by : TELANGANA KERATAM

అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవంలో పాల్గొన్న బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరారెడ్డి నరేందర్ రెడ్డి

News Image
 సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 
శంభీపూర్: బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కన్నెస్వామి గారి స్వగృహంలో ఈరోజు నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.ఈ పవిత్ర పూజా కార్యక్రమానికి జీడిమెట్ల 132వ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వీరారెడ్డి నరేందర్ రెడ్డి గారు హాజరై, శంభీపూర్ రాజు గారు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారితో కలిసి మహాపడి పూజలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి గారు, రమణారావు , రాంరెడ్డి గారితో పాటు పలువురు ప్రముఖులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
🏠 Home