🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 20 November 2026, 5:16 am Posted by : TELANGANA KERATAM

సంక్షేమ హాస్టళ్లలో నాణ్యత లేని భోజనం అందిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి!!

News Image
తెలంగాణ కెరటం నిర్మల్ జిల్లా ప్రతినిధిలక్ష్మణ్ 
అడ్వకేట్ జగన్ మోహన్బీ ఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు కనీసం నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు అందించలేని పరిస్థితి నెలకొనడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని బహుజన్ సమాజ్ పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ తీవ్రంగా విమర్శించారు.కొన్ని హాస్టళ్లలో పురుగులు ఉన్న అన్నం, కుళ్లిన కూరగాయలు, నాణ్యత లేని ఆహారం, కలుషితమైన తాగునీరు అందుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకునేది పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలే కాబట్టి వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. విద్యార్థులకు పెట్టే అన్నంలో కూడా నాణ్యత పాటించకపోవడం సిగ్గుచేటని, ఇలాంటి నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిని కేవలం హెచ్చరించి వదిలేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఆహార పదార్థాల నమూనాలను పరీక్షించాలి. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి. వంటగదులు, భోజనశాలలు, తాగునీటి వనరుల పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలి. నాణ్యత లేని ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లను తొలగించడంతో పాటు, నిర్లక్ష్యం వహించే వార్డెన్లు, సంబంధిత అధికారులపై బాధ్యత నిర్ణయించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.బాసర ట్రిపుల్ ఐటీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలినిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో చదువుకుంటున్న వేలాది మంది గ్రామీణ పేద విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రమైన వసతి, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులను బాధ్యులుగా చేయాలి. విద్యార్థుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సమయపరిమితితో కూడిన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.
ప్రభుత్వానికి బీఎస్పీ హెచ్చరిక నవంబర్ 19న బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి విద్యార్థుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు.
విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బహుజన్ సమాజ్ పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. హాస్టళ్లలో ఆహార నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఇచ్చిన వినతిపత్రంపై అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలి. లేకపోతే విద్యార్థుల హక్కుల కోసం బీఎస్పీ ఆధ్వర్యంలో మరింత ఉధృతమైన ప్రజా ఉద్యమం చేపడతామని అడ్వకేట్ జగన్ మోహన్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులులక్ష్మియాదవ్,జిల్లా కార్యదర్శి చెరుకు రాజ్యం,జిల్లా కార్యవర్గ సభ్యులు కాటం ప్రభాకర్,జిల్లా కోశాధికారి పడిగెల రాజేష్, నిర్మల్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పసుల సంజయ్ కుమార్,మహిళ నాయకులు మాలతీ,సుగుణలు పాల్గొన్నారు.
🏠 Home