మెదక్ జిల్లా సమస్యల పై వినతి పత్రం అందజేత
తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి నవంబర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo లోని మైనింగ్, కార్మిక శాఖ,మంత్రివర్యులు శ్రీ డాక్టర్ గడ్డం వెంకటస్వామి ఛాంబర్ లో కలిసి మెదక్ జిల్లాలో వివిధ అంశాల పైన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మల మైసయ్య మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని పలు గ్రామాలలో దళితుల పైన దాడుల విషయం ఏడుపాయల* గుడి సమీపంలో మాలలకు కమ్యూనిటీ హాల్ విషయంలో మెదక్ పట్టణ కేంద్రంలో ప్రజాయుద్ధనౌక గద్దర్అన్న విగ్రహానికి స్థలాన్ని కేటాయించాలని,నర్సాపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని,నార్సింగి మండల కేంద్రం అంబేద్కర్ భవనానికి అలాగే ప్రజా యుద్ధనౌక గద్దర్* అన్న, కాక గుడిసెల వెంకటస్వామి గార్ల విగ్రహాలకు స్థలాన్ని కేటాయించాలని అలాగే నిజాంపేట మండల కేంద్రంలో మాలలకు కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని బొమ్మల మైసయ్య, మైనింగ్ కార్మిక శాఖ మంత్రివర్యులకు వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా నార్సింగి గ్రామపంచాయతీ ఈవో నాగభూషణం, ఎంపీడీవో తిరుపతి రెడ్డి, హౌసింగ్ ఏ ఈ సంధ్య, మెదక్ జిల్లా హౌసింగ్ పీ డీ మాణిక్యం, నార్సింగ్ మండల ఎంపీ ఓ వీరందరూ కలిసి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని మంత్రి గారి కి కలిసి విన్నవించడం జరిగింది.