🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 20 November 2026, 7:22 pm Posted by : TELANGANA KERATAM

మంత్రివర్గ విస్తరణలో బీసీలకు సగం వాటా ఇవ్వాల్సిందే

News Image

డిప్యూటీ సీఎం పదవికి బీసీలు అర్హులు కాదా..?త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టులలో బీసీలకు 60 శాతం దక్కాల్సిందే

కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకపోతే కాంగ్రెస్ పై బీసీల తిరుగుబాటు తప్పదు
డిసెంబర్ 14న ఢిల్లీలో జరిగే బీసీల జన భేరీ సభ ను జయప్రదం చేయాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు అనేక హామీలు ఇచ్చిందని, హామీలు ఇచ్చి మూడు సంవత్సరాలు పూర్తి అవుతున్న ఇంతవరకు హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం చెందిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు 
నేడు కామారెడ్డి పట్టణంలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆర్థిక సంవత్సరం బీసీల సంక్షేమానికి 20వేల కోట్లు కేటాయించి ఐదు సంవత్సరాల గాను లక్ష కోట్లు కేటాయిస్తామని, బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని, ప్రభుత్వ కాంట్రాక్టర్లలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని,ప్రభుత్వ పదవులు, నామినేటెడ్ మరియు మంత్రివర్గంలో బీసీలకు జనాభా దామాషా ప్రకారం అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేటి వరకు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉన్నందున రాష్ట్ర మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంతో సహా 8 మంది బీసీలకు మంత్రులుగా అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు 
అలాగే నామినేటెడ్ పోస్టులు, ఐఏఎస్,ఐపీఎస్, యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్, పోస్టులలో బీసీలకు తెలంగాణలో జరిగిన బీసీ కులగనన లెక్కల ప్రకారం 60 శాతం వాటా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు నెల రోజుల్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సంపూర్ణంగా అమలు చేయకపోతే లక్ష మందితో కామారెడ్డిలో బీసీ గర్జన నిర్వహించి కాంగ్రెస్ పై తిరుగుబాటు జెండా ఎగిరేస్తామని ఆయన హెచ్చరించారు జాతీయ జనగణలో బీసీ కులగనన చేపట్టాలని, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించి బీసీ కులాల లెక్కలు తీయాలని ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి డిసెంబర్ 14న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో బీసీల జనభేరి సభను నిర్వహిస్తున్నామని ఈ సభకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్,సాప శివరాములు,బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నీల నాగరాజు, బిసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మనిమంజరి, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సంధ్యారాణి,మహిళా అధ్యక్షురాలు బాజ లలిత, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట స్వామి,కొత్తపల్లి మల్లన్న,రాజయ్య,మొహనాచారి,యాదగిరి,ఎల్లయ్య,నర్సింలు,సంజీవ్,వెంకట్,రాజ నర్సింలు,విగ్నేష్,ప్రతాప్, శివమణి,బాలరాజు, శ్రీనివాస్,నితిన్. తదితరులు పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home