🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 20 November 2026, 8:02 pm Posted by : D RAMAKRISHNA

"ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా"తో పేదలకు ఎంతో లబ్ధి

News Image

37వ డివిజన్ పెంటగడ్డ బజార్ రోడ్డు విస్తరణ ప్రతిపాదనను పునఃపరిశీలించాలి

  • • ఇళ్లకు నష్టం కలగకుండా రోడ్డు, డ్రైనేజీ పనులు చేపట్టాలి
  • • బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వీరవెల్లి రాజేష్ గుప్తా

ఖమ్మం, నవంబర్ 20 (తెలంగాణ కెరటం): 
ఖమ్మం: ఖమ్మం నగరంలోని 37వ డివిజన్ పరిధిలో పాత మున్సిపల్ కార్యాలయం నుంచి ఖిల్లా ఎంట్రన్స్ వరకు ఉన్న పెంటగడ్డ బజార్ రోడ్డును 40 అడుగుల మేర విస్తరించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరుతూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్యకి 37వ డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ వీరవెల్లి మిత్రవింద రాజేష్ గుప్తా వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఇళ్లకు నష్టం కలగకుండా, ఇప్పటికే చేపట్టిన డ్రైనేజీ పనులను పూర్తి చేసి, రెండు వైపులా డ్రైనేజీలు నిర్మించి రోడ్డు అభివృద్ధి చేయాలని కోరారు. స్థానిక నివాసితులు, వ్యాపారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ప్రజలకు నష్టం కలగకుండా న్యాయం చేయాలని కమిషనర్‌ను విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ అధ్యక్షులు గడిల నరేష్, జిల్లా నాయకులు పొట్టి మూతి జనార్ధన్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి మేడ సంపత్ కుమార్, ఒకటో పట్టణ ప్రధాన కార్యదర్శులు పాలెపు రాము, పొట్టి మూతి వాణి పాల్గొన్నారు.
Additional News Photo
🏠 Home