🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 20 November 2026, 9:03 pm Posted by : TELANGANA KERATAM

అన్నదాన దాత రఘు స్వామికి ఆంజనేయ స్వాముల ఘన సన్మానం.

News Image
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 20):
హనుమాన్ మాలాధారణ చేపట్టిన స్వాములకు గత కొన్ని రోజులుగా మధ్యాహ్న వేళ అన్నదానం నిర్వహిస్తున్న దాత రఘు స్వామిని శుక్రవారం ఆంజనేయ స్వాములు ఘనంగా సన్మానించారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన రఘు స్వామి హనుమాన్ మాలధారులకు భిక్ష ఏర్పాటు చేస్తూ తన భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. 
రామాంజనేయ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బాలరాం గురుస్వామి ఆధ్వర్యంలో భిక్ష కార్యక్రమం కొనసాగుతుండగా అన్నదానానికి రఘు స్వామి పూర్తి సహకారం అందిస్తున్నారు.మాలధారణ పూర్తయ్యే వరకు తన వంతుగా మధ్యాహ్న వేళ అన్నదాన సేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని రఘు స్వామి తెలిపారు.
 ఆంజనేయ స్వాములకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తోందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రఘు స్వామి అందిస్తున్న సేవలను ఆంజనేయ స్వాములు కొనియాడుతూ ఆయనను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు హనుమాన్ మాలధారణ స్వాములు పాల్గొన్నారు.
🏠 Home