🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 20 November 2026, 10:29 pm Posted by : TELANGANA KERATAM

గుంలాపూర్ లో కుటుంబ జీవిత భీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

News Image
గుంలాపూర్ లో కుటుంబ జీవిత భీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం 

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 20 : కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామ పంచాయతీ వద్ద శుక్రవారం సర్పంచ్ శ్రీమతి రౌట్ల స్రవంతి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం దరఖాస్తుల స్వీకరణ శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ వద్ద లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి, ఆన్లైన్లో నమోదు చేశారు. దరఖాస్తుల స్వీకరణ శిబిరాన్ని డిఆర్డిఏ పీడీ రఘువరన్, ఎంపీడీవో వోదెల రామకృష్ణ, ఎమ్మార్వో కృష్ణ చైతన్యలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు గంగజల, సరిత, శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు సరిత, శ్రీవిద్య, సురేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home