బుగ్గారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జీపీ కార్మికులకు ప్రమాద బీమా సదుపాయం
బుగ్గారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జీపీ కార్మికులకు ప్రమాద బీమా సదుపాయం
కార్మికుల భద్రతకు భరోసా.. సంక్షేమానికి మరో ముందడుగు!జగిత్యాల జిల్లా, బుగ్గారం: గ్రామపంచాయతీ కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని బుగ్గారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రాయల్ సుందరం (రాయల్ సుందరం ) సంస్థ ద్వారా జీపీ కార్మికులకు వ్యక్తిగత ప్రమాద బీమా సదుపాయం కల్పించారు.
గ్రామ ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ, గ్రామ పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల సేవలను గుర్తించి, ప్రమాదవశాత్తు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వారికి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీమా సదుపాయాన్ని అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నక్క రాజవ్వ–రాజయ్య, ఉపసర్పంచ్ జంగ లావణ్య–శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి ఎం.ఏ. అక్బర్, బుగ్గారం మండల అధ్యక్షులు నాగునూరి నర్సాగౌడ్, వార్డు సభ్యులు బెజ్జారపు రాజు, ఆకుల శేఖర్, పోస్టల్ శాఖ తరఫున నాగరాజు, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.కార్మికుల కష్టానికి గౌరవం.. వారి కుటుంబాలకు భద్రత.. గ్రామ సంక్షేమమే లక్ష్యం!