🏠 telanganakeratam.in
Title:
Sub-Titles:
Body Text:
Theme Bar:
Watermark
Clip Header Logo
Date of Publish : 20 November 2026, 11:14 pm Posted by : TELANGANA KERATAM

700 సర్వే నెంబర్ లో ప్లాట్లు ఇచ్చేవరకు కదిలేదే లేదు

News Image
*700 సర్వే  నెంబర్ లో ప్లాట్లు ఇచ్చేవరకు కదిలేదే లేదు భువనగిరి పట్టణంలో 700 సర్వే నెంబర్ లో  ఇల్లు లేని నిరుపేదలందరూ గుడిసెలు వేసుకున్నారు. స్థలం ఇచ్చేవరకు కదిలేదే లేదని సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అన్నారు*
 ఈ సందర్భంగా మాట్లాడుతూభువనగిరి పట్టణంలో అనేకమంది నిరుపేదలు ఇండ్లు లేక కిరాయిల్లో ఉంటూ చేసిన కష్టం కిరాయిలకే కట్టవలసి వస్తుంది. గతంలో 2025 జూన్ లో గుడిసెలు వేస్తేఆర్డిఓ ఎమ్మార్వోఅధికారులు  గుడిసెలవాసులతో సిపిఎం నాయకులతో చర్చలు జరిపి నెల రోజులలో ప్లాట్లు చేసి ఇస్తామని తెలిపినారు. ఆ నమ్మకంతో గుడిసెలు తీసి వేసినాము 700 సర్వే నెంబర్ పై నిర్లక్ష్యం వహిస్తున్నారు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.సంవత్సర నర కాలంలో అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చి నా స్పందన లేదు. గత్యంతరం లేని పరిస్థితిలో మరల 700 సర్వే నెంబర్లు 107 మందికి పట్టాలు సర్టిఫికెట్స్ ఇచ్చిన వారితోపాటు ఇల్లు లేని నిరుపేదలందరితో కలిసి మంగళవారం రోజున 17 తారీకు న సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గుడిసెలు వేయడం జరిగింది. నేటికి నాలుగు రోజులు అవుతుంది .20వ తేదీన అధికారులు పోలీసులు వచ్చి తీసివేస్తే కచ్చితంగా ఇస్తామని వేసిన గుడిసెలను తీయాలని అన్నారు కానీ అధికారులు 21 సంవత్సరాలు గడిచిన ఇచ్చిన మాటను అమలు చేయనటువంటి పరిస్థితులలో లేరు కావున భూమిని చదును చేసి లేఅవుట్ చేసి లబ్ధిదారులకు పేద ప్రజలకు కేటాయించే వరకు ఈ జాగాల నుంచి కదిలేది లేదని అన్నారు. పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ మాట్లాడుతూ  ఈ హామీలన్నీ అనేకసార్లు విని విసు విస్కు చెంది  మరల గుడిసెలు వేయడం జరిగింది . లేఅవుట్ చేసి ఇచ్చేంతవరకు స్థలం నుండి కదలమని చెప్పడం జరిగింది . ఇప్పటికైనా అధికారులు లేవ్ చేసి క్రమబద్వీకరణగా నెంబర్లు వేసి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్లస్థలాలు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం  పట్టణ నాయకులు వోల్దాస్ అంజయ్య, నరాల నరసింహ లక్ష్మయ్య, కొత్త లలిత, ఇక్కుర్తి కళావతి, తులసి,కన్యబోయిన అరుణ, కృష్ణవేణి, దేశపాక ఆంజనేయులు, అనిత, రేణుక,  జి మల్లేష్, గడ్డం రాజు, గుడ్ల మహేష్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు. 
పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ
🏠 Home