భైంసాలో ఘనంగా ముగిసిన “యంగ్ మైండ్స్ – నాలెడ్జ్ ఛాంపియన్స్ 2026” అంతర్ పాఠశాలల విజ్ఞాన పోటీలు*
*భైంసాలో ఘనంగా ముగిసిన “యంగ్ మైండ్స్ – నాలెడ్జ్ ఛాంపియన్స్ 2026” అంతర్ పాఠశాలల విజ్ఞాన పోటీలు*
తెలంగాణ నిర్మల్ జిల్లా ప్రతినిధి పిల్లికర్ లక్ష్మణ్-
18 జట్లతో హోరాహోరీ పోటీలు – జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో విజేతలకు బహుమతుల ప్రదాన:
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో సాధారణ విజ్ఞానం, శాస్త్రీయ ఆలోచనా విధానం, తార్కిక విశ్లేషణ, సమయస్ఫూర్తి, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే ఉన్నత ఆశయంతో ఆనందితహ ఫౌండేషన్, నిర్మల్ ఆధ్వర్యంలో నిర్వహించిన “యంగ్ మైండ్స్ – నాలెడ్జ్ ఛాంపియన్స్ 2026” అంతర్ పాఠశాలల విజ్ఞాన పోటీలు భైంసా పట్టణంలోని డాక్టర్స్ అసోసియేషన్ భవనంలో, నర్సింహ నగర్లో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి.
ఈ కార్యక్రమంలో భైంసా పట్టణ పరిధిలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల మేధో సామర్థ్యాన్ని పరీక్షించేలా నిర్వహించిన ఈ పోటీల్లో ప్రాథమిక ఉన్నత తరగతుల విభాగం, ఉన్నత తరగతుల విభాగం కలిపి మొత్తం 18 జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నాయి. ఒక్కో విభాగంలో తొమ్మిది జట్లు పోటీపడటం విశేషం.అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ జాదవ్ బల్వంత్ రావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికాలో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్న డాక్టర్ జాదవ్ బల్వంత్ రావు పటేల్ విచ్చేసి విద్యార్థులను ప్రోత్సహించరూ. అలాగే శ్రీ రవి , శ్రావణ్ , భీమ్రావు, మహేష్, అనిల్ దుగ్గె తదితర ప్రముఖులు పాల్గొన్నారు.భైంసా పట్టణంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు.జూనియర్స్ విభాగం – మొదటి గ్రూపు
నాలుగు, ఐదు, ఆరవ తరగతుల విద్యార్థులు
ఈ విభాగంలో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొని విజయం కోసం ఉత్సాహంగా పోటీపడ్డాయి.
విజేతల వివరాలు:
ప్రథమ బహుమతి: ఆల్ ఫోర్స్ పాఠశాల, భైంసా.
ద్వితీయ బహుమతి: వాసవి ఉన్నత పాఠశాల, భైంసా.
తృతీయ బహుమతి: నోబుల్ ఉన్నత పాఠశాల, భైంసా.
సీనియర్స్ విభాగం – రెండవ గ్రూపు
ఏడవ, ఎనిమిదవ, తొమ్మిదవ తరగతుల విద్యార్థులుసీనియర్స్ విభాగంలో కూడా మొత్తం తొమ్మిది జట్లు పాల్గొని తమ విజ్ఞాన ప్రతిభను ప్రదర్శించాయి. ఆసక్తికరమైన ప్రశ్నలు, సమయపాలన, జట్టు సమన్వయంతో పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి.
విజేతల వివరాలు:
ప్రథమ బహుమతి: చాణక్య సంస్కృతి పాఠశాల, భైంసా.
ద్వితీయ బహుమతి: వాసవి ఉన్నత పాఠశాల, భైంసా.తృతీయ బహుమతి: వికాస్ ఉన్నత పాఠశాల, భైంసా.పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక బహుమతులు
ఈ కార్యక్రమంలో కేవలం విజేతలకే కాకుండా పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కల్పించారు. విజేతలకు బంగారు పతకాలు, వెండి పతకాలు, జ్ఞాపికలు మరియు ప్రశంసాపత్రాలు అందజేశారు.
అలాగే పోటీల్లో పాల్గొన్న మిగతా విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులు, జ్ఞాపికలు మరియు ప్రశంసాపత్రాలు అందించి వారి ప్రతిభను అభినందించారు.
విద్యార్థుల్లో గెలుపు, ఓటముల కంటే పాల్గొనే ధైర్యం, నేర్చుకోవాలనే ఆసక్తి, కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన ముఖ్యమనే సందేశాన్ని ఈ కార్యక్రమం అందించింది.
ప్రధాన స్పాన్సర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించి పూర్తిస్థాయిలో సహకరించిన సాయి సుప్రియా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, భైంసా యాజమాన్యానికి, ముఖ్యంగా డాక్టర్ టి. రాజినీకాంత్, ఎం.ఎస్. (శస్త్రచికిత్స నిపుణులు) గారికి ఆనందితహ ఫౌండేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు.విద్యార్థుల విద్యా వికాసం, మేధో వికాసం మరియు భవిష్యత్తు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి విద్యా కార్యక్రమాలకు సహకరించడం అభినందనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తే మా లక్ష్యం – వాడేకర్ లక్ష్మణ్ఈ సందర్భంగా ఆనందితహ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ మాట్లాడుతూ,
విద్యార్థుల భవిష్యత్తు కేవలం పాఠ్యపుస్తకాలలోని మార్కులతో మాత్రమే నిర్ణయించబడదని, వారికి సాధారణ విజ్ఞానం, ఆలోచనా శక్తి, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, సంభాషణా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు కూడా ఎంతో అవసరమని తెలిపారు.ప్రతి విద్యార్థిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ దాగి ఉంటుందని, ఆ ప్రతిభను గుర్తించి సరైన వేదికను కల్పించినప్పుడు అద్భుతమైన ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు.ఈరోజు 18 జట్లు ఉత్సాహంగా పాల్గొనడం, విద్యార్థులు ఎంతో ఆత్మవిశ్వాసంతో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి తమ దృష్టిలో విజేతేనని, భవిష్యత్తులో విద్యార్థుల కోసం మరిన్ని విద్యా, వ్యక్తిత్వ వికాస మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి ఆనందితహ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
పాఠశాలల యాజమాన్యాలకు ప్రత్యేక ధన్యవాదాలుఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన భైంసా పట్టణంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ముఖ్య అతిథులు, వాలంటీర్లు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆనందితహ ఫౌండేషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే ఆనందితహ ఫౌండేషన్ లక్ష్యం
ఆనందితహ ఫౌండేషన్, నిర్మల్ విద్యార్థుల విద్యా అభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
“చిన్న వయసులోనే పెద్ద ఆలోచనలు… నేటి విద్యార్థులే రేపటి విజ్ఞానవంతమైన నాయకులు!” అనే ఆశయంతో నిర్వహించిన ఈ కార్యక్రమం భైంసా పట్టణ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని, విజ్ఞానంపై ఆసక్తిని నింపింది.