శేకల్ల గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై హర్షం.. సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
శేకల్ల గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై హర్షం.. సీఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించడం అభినందనీయం – గ్రామ ప్రజలు
జగిత్యాల జిల్లా, బుగ్గారం మండలంలోని శేకల్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు బుగ్గారం మండలంలోని శేకల్ల గ్రామంలో కూడా పథకం ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించేలా ప్రభుత్వం గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి చిత్రపటాలకు గ్రామ ప్రజలు పాలాభిషేకం నిర్వహించి, ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుగ్గారం మండల అధ్యక్షుడు శ్రీ నాగునూరి నర్సగౌడ్ గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పర్స రమేష్, ఉపసర్పంచ్ నార్ల బుచ్చయ్య, నంది తిరుపతి, సుధీర్ సింగ్, సురేందర్, గాలిపెల్లి వెంకన్న, రావు, జంగిల్ రమేష్, సీహెచ్ చందు, దుర్గ సింగ్, మహేశ్వర్ సింగ్, మురళీ గౌడ్, నంది వెంకట్రాములు, పర్స గంగయ్య, జక్క విజయ్, గ్రామ ప్రజలు, యువజన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.